ఈ వారం హౌస్‌ నుండి బయటికి వెళ్లేదెవరంటే!

మరిన్ని వార్తలు

జీవితంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు. కానీ, బిగ్‌బాస్‌ మాత్రం చాలా రాళ్లే వెనకేసుకోమన్నాడు తాజాగా ఇచ్చిన 'రాళ్లే రత్నాలు' టాస్క్‌ ద్వారా. బయటి నుండి విసిరే డబ్బుల రాళ్లను ఒడిసి పట్టుకుని ఎవరైతే జాగ్రత్త చేసుకుంటారో వారే ఈ టాస్క్‌లో విజేతలు. అయితే, ఈ టాస్క్‌ నామినేషన్‌ ప్రక్రియ కోసం జరిగింది. రాళ్లు వెనకేసుకోవడంలో ఎవరైతే వెనకబడి ఉంటారో వారు డైరెక్ట్‌గా నామినేట్‌ అవుతారు.

 

అలా మొదట్లోనే నామినేట్‌ అయిన కంటెస్టెంట్‌ రాహుల్‌. ఆ తర్వాత మహేష్‌, పునర్నవి యాడ్‌ అయ్యారు. లాస్ట్‌ బజర్‌ మోగేసరికి అత్యంత తక్కువ రాళ్లు వెనకేసుకున్న కంటెస్టెంట్‌గా వరుణ్‌ సందేశ్‌ ఉండడంతో, నామినేషన్స్‌ లిస్టులో వరుణ్‌ పేరు కూడా చేరింది. అలా ఈ వారం హౌస్‌ నుండి బయటికి వెళ్లేందుకు వరుణ్‌, రాహుల్‌, పునర్నవి, మహేష్‌లు నామినేట్‌ అయ్యారు. అయితే, ఈ సారి ఎలిమినేషన్‌ చాలా టఫ్‌గా ఉంది. వీరిలో ఎవర్ని ఈ వారం బయటికి పంపిస్తారనే అంశంపై అంచనా వేయడం కష్టమైన ప్రక్రియనే. అయితే, బిగ్‌బాస్‌లో ఏదైనా జరగొచ్చు. ఈ వారం ఎలిమినేషన్‌ లేకనూ పోవచ్చు.

 

దిలా ఉంటే, ఇంతవరకూ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని కేవలం 15 రోజులు మాత్రమే హౌస్‌లో ఉంచారు. అలాగే అలీని కూడా ఈ వారం బయటికి పంపిస్తారని అనుకున్నారంతా. కానీ, హయ్యెస్ట్‌ డబ్బులు సంపాదించి అందరి కంటే ముందంజలో ఉండడంతో అసలు నామినేషన్స్‌లోనే లేడు అలీ. టాస్క్‌ల్లో ది బెస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇవ్వడంలో అలీ మొదట్నుంచీ ఫస్ట్‌ ప్లేస్‌లోనే ఉంటాడు. రీ ఎంట్రీలో కూడా అదే జోరు చూపించాడు. ఒకవేళ నామినేషన్స్‌లో ఉండి ఉంటే, ఆడియన్స్‌ ఖచ్చితంగా ఆలీని బయటికి పంపించేవారు. కానీ, అలా జరగలేదు. చూడాలి మరి అలీని ఇంకెన్ని రోజులు హౌస్‌లో ఉంచాలనుకుంటున్నారో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS