బిగ్‌బాస్‌లో టాస్క్‌లు వికృత చేష్టలకు దారి తీస్తున్నాయి. పార్ట్లు పార్ట్‌లుగా సాగిన 'బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్' టాస్క్‌లో భాగంగా పోటీదారులైన బాబా భాస్కర్, వితికలకు విపత్కర పరిస్థితి వచ్చింది. ఫైనల్ పార్ట్ అత్యంత క్లిష్టంగా జరిగింది. మూడు స్వెట్టర్లు ధరించడం, వర్షంలో తడవడం, మిరపకాయలు తినడం, ట్యాంక్ ఫుల్ అయిపోవడం, ఆ స్టేజ్‌లో యాపీ ఫిజ్ పెద్ద బాటిల్ తాగడం.. ఇలా బిగ్‌బాస్ టార్చర్‌ని చూశారు వీక్షకులు. ఈ క్రమంలో ఈ టాస్క్ పట్ల చాలా నెగిటివిటీ వచ్చేసింది.
ఇలాంటి టాస్క్‌లు బిగ్‌బాస్ ఎలా డిజైన్ చేస్తున్నాడు.. అంటూ గుస్సా అవుతున్నారు నెటిజన్లు. వాష్ రూమ్‌కి వెళ్లడాని కనీసం ఒక లిమిటెడ్ టైం కేటాయించి ఉండాల్సింది. అలా కాకుండా, అందుకు వారిని అనుమతించలేదు సరికదా.. ఉన్నచోటే టాయిలెట్ చేయడం.. వంటి ఆలోచనలు చేసేలా కంటెస్టెంట్స్‌ని ప్రేరేపించడం చాలా చాలా తప్పు. అక్కడ పోటీదారులుగా ఉన్నది ఒక మగ కంటెస్టెంట్, ఒక ఆడ కంటెస్టెంట్.
అలాంటప్పుడు ఇలాంటి వికృత చేష్టలకు ఆస్కారం ఎలా.? ఈ టాపిక్‌పై మిగిలిన ఇంటి కంటెస్టెంట్లు సిగ్గు లేకుండా పదే పదే చర్చలకు దిగడం.. టోటల్‌గా ఒళ్లు గగుర్పొడిచేలా ఈ టాస్క్ జరిగింది. ట్యాంక్ ఫుల్ అయ్యి ఆపుకోలేని పరిస్థితిలో బాబా భాస్కర్ అక్కడే టాయిలెట్ చేయడానికి సిద్ధమవుతున్న వేళ, అది ఓర్వలేని వితిక ఆయన్ని రిక్షాలోంచి కిందికి తోసేసింది. అలా బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్' టాస్క్‌లో వితిక విన్నర్‌గా నిలిచింది.