తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. ఎప్పుడు ఏమిటన్నది అనౌన్స్ చేయలేదు కానీ, మాక్సిమం ఆగస్టు లో సీజన్ మొదలవుతుందని సమాచారం. హోస్ట్ గా నాగార్జునే కంటిన్యూ అవనున్నారని తెలుస్తోంది. శివాజీ ఈ సారి కూడా బిగ్ బాస్ లో సందడి చేయనున్నారు. కాకపొతే హోస్ట్, కంటెస్టెంట్ కాదు, ఎలిమినేట్ అయినవారిని ఇంటర్వ్యూ చేసే పాత్రలో. అసలు ఎప్పుడూ ఈ టైంకే బిగ్ బాస్ హాడావిడి మొదలయ్యేది. కానీ ఈసారి ఇంకా కంటెస్టెంట్లు సెలక్షన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
ఈ ఏడాది బిగ్ బాస్ 8 కి వివాదాస్పద కంటెస్టెంట్స్ కి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. మొదటగా చెప్పుకోవాల్సింది సెలబ్రిటీస్ జాతకులు చెప్తూ పాపులర్ అయిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి. వేణు స్వామి ఎక్కడుంటే అక్కడ వివాదాలు వెతుకుంటూ వస్తాయి. కంటెంట్ కి లోటుండదు. నెక్స్ట్ ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలిచిన కుమారి ఆంటీ. ఈ మధ్య కుమారి ఆంటీ పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ కి వెళ్ళక ముందే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది కుమారి ఆంటీ. ఈ మధ్య సోనూ సూద్ కూడా కుమారి ఆంటీ ని సపోర్ట్ చేస్తూ తన స్టాల్ ని దర్శించాడు.
బెంగుళూర్ రేవ్ పార్టీలో దొరికి వివాదాస్పదంగా మారిన హేమ కూడా బిగ్ బాస్ లో సందడి చేయనుంది. హేమ ఇది వరకే ఒక సారి బీబీ హౌస్ కి వెళ్లి వచ్చింది. కానీ ఈ సారి లెక్క వేరు. హేమ ఇప్పుడు చాలా పాపులర్. జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్ కిర్రాక్ ఆర్పీ. RP ఈ మధ్య సోషల్ మీడియాలో వైసీపీ పై కామెంట్స్ చేస్తూ లైమ్ లైట్ లోకి వచ్చాడు. దీనితో RP ఎంట్రీ పక్కా అయ్యింది. బర్రెలక్క, టీవీ ఆర్టిస్ట్స్ అమరదీప్ వైఫ్ తేజస్విని, అక్షిత, హారిక, సాయికిరణ్ లతో పాటు ఇంకొంతమంది యుట్యూబర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే లిస్ట్ లో ఉన్నట్లు టాక్.