తెలుగు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకి ప్రేక్షకుల్లో సుస్థిరస్థానం ఉంది. తన నటనతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు కోటా. ఈ మధ్య కొన్ని అనారోగ్య సమస్యల వలన, ఏజ్ వలన ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో కోటా మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మొదటి నుంచి ఎన్టీఆర్ కి స్టార్ డమ్ ఉంది. అది నందమూరి వంశం పేరుతో రాలేదు తన నటన, హార్డ్ వర్క్, సక్సెస్ కారణంగా వచ్చిందే, RRR తరవాత ఆ క్రేజ్ ఇంకొంత విస్తరించి గ్లోబల్ స్టార్ అయిపోయాడు.
కోటా శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. 'నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో కొద్దో గొప్పో విషయం ఉండి, సత్తా ఉన్న నటుడు ఎవడైనా ఉన్నాడంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. నా ప్రకారం వాడి తర్వాతే ఎవడైనా, పొట్టిగా ఉంటాడని, కానీ ఆ పొట్టితనమే తనకి ప్లస్ అని చంద్రమోహన్ తో కంపేర్ చేశారు. చంద్ర మోహన్ కూడా ఎవడికీ కాంపిటేషన్ కాదు, చంద్ర మోహన్ కి ఎవరూ కాంపిటీషన్ లేరు అని సరదాగా చెప్పారు. డైలాగ్స్, డ్యాన్సులు, యాక్షన్ ఇలా ప్రతీ ఒక్క దాంట్లో ఎన్టీఆర్ కి టాలెంట్ ఉంది. ఏ లోటు లేదు ఎన్టీఆర్ కి తిరుగు లేదు అని వ్యాఖ్యానించారు.
సీనియర్ ఎన్టీఆర్ ఇది గ్రహించే మనవడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని, బొట్టు పెట్టి మరీ తన పేరు పెట్టుకున్నారు అని తెలిపారు కోటా. ఒక సందర్భం లో ఎన్టీఆర్ కూడా ఈ విషయం చెప్పారు. తాతగారే స్వయంగా తన పేరు మార్చి తారక రామారావు పేరు పెట్టినట్లు. ఇప్పుడు ఇదే విషయాన్ని కోటా కూడా ప్రస్తావించారు. నిజంగా ఎన్టీఆర్ దూర దృష్టికి హ్యాట్సాఫ్. కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు వైరలవుతుండటంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు. లెజండ్రీ యాక్టర్ తమ హీరోని ప్రశంసించటం గొప్ప విషయమే కదా అని ఖుషి అవుతున్నారు.