ఎన్ని హిట్లు వచ్చినా, తెలుగు సినిమా రేంజ్ ఏ స్థాయిలో పెరిగినా ఓవరాల్ సక్సెస్ రేట్ మాత్రం అంతగా కనిపించడంలేదు తెలుగు సినీ పరిశ్రమలో. దానికి కారణాలు ఏవైనప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో సంఖ్యా పరంగా ఎప్పుడూ సరికొత్త రికార్డులే. దక్షిణాదిలో తెలుగు సినీ పరిశ్రమ ప్రత్యేకం. బాలీవుడ్‌తో పోటీ పడే సత్తా సినిమాల పరంగా తెలుగు సినీ పరిశ్రమకే ఉంది. అయితే కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చడమే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమలో నిస్తేజం నింపుతుండడం శోచనీయం. అలాంటి సినిమాలు 2016లో ఏమేం వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మూెత్సవం: 2016 మొత్తంలో ఇంత భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ఇంకోటి లేదనడం అతిశయోక్తి కాదు. ఎన్ని అంచనాలతో వచ్చినా సినిమాలో ఆ స్థాయి విషయం లేకపోతే ఆ అంచనాలు తల్లకిందులైపోతాయి. అసలేమీ విషయం లేక 'బ్రహ్మూెత్సవం' దారుణంగా నిరాశపరిచింది. ఇది మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవడం శోచనీయం. 100 కోట్లు దాటేస్తుందనుకున్న 'బ్రహ్మూెత్సవం', అతి దారుణమైన పరాజయం ఎదుర్కొంది.
స్పీడున్నోడు: తొలి సినిమా 'అల్లుడు శీను'తో కెరటంలా దూసుకొచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రెండో సినిమా 'స్పీడున్నోడు'తో దారుణ పరాజయాన్ని చవిచూశాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడో పోయిందో ఎవరికీ తెలియదు. సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేశారు. సినిమా కోసం చేసే ఖర్చు ఒక ఎత్తు అయితే, దాని పబ్లిసిటీ కోసం చేసే ఖర్చు తడిసి మోపెడైపోయింది. భారీ అంచనాల నడుమ వచ్చి, తుస్సుమంది ఈ 'స్పీడున్నోడు'.
తిక్క: 'సుప్రీం' సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ నుంచి వచ్చిన 'తిక్క' సినిమా తిక్క తిక్కగానే ఉండటంతో ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. మరీ ఇంత దారుణమైన సినిమా ఎలా చేశాడు? అనే విమర్శల్ని సాయిధరమ్‌తేజ ఎదుర్కొనాల్సి వచ్చింది. అనూహ్యమైన మార్కెట్‌ని పెంచుకున్నట్టే పెంచుకుని, ఒక్క సినిమాతో బయ్యర్లలో అనుమానాలు పెంచేశాడు సాయిధరమ్. అలా 'తిక్క' ఎప్పటికీ చెరిగిపోలేని చేదు ముద్రని సాయిధరమ్ కెరీర్ మీద వేసింది.
ఒకమనసు: చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అవుతుందనుకుంటే తొలి రోజు తొలి షోకే దారుణ పరాజయం ఎదుర్కొంది ఈ సినిమా. నాగబాబు కుమార్తె నిహారిక తొలి సినిమాతోనే తీవ్రంగా నిరాశపరిచింది. అడుగడుగునా సినిమాలో నిస్తేజం కూరుకుపోయిన పాత్రలో కనిపించిన నిహారికను అప్పటిదాకా బుల్లితెరపై చాలా ఎనర్జిటిక్‌గా చూసిన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. సినిమాకి జరిగి ప్రమోషన్‌కీ సినిమా రిజల్ట్‌కీ వ్యత్యాసం చాలా చాలా ఎక్కువ. తద్వారా భారీ అంచనాల నడుమ విడుదలై భారీ డిజాస్టర్ చవిచూసిన చిత్రంగా ఒక మనసు రికార్డులకెక్కింది.
'సర్దార్ గబ్బర్‌సింగ్', 'కృష్ణాష్టమి', 'డిక్టేటర్' ఇలా చాలా సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. 50 కోట్ల పైన వసూలు చేసినా, 100 కోట్లపైన అంచనాలతో విడుదలైన పవన్‌కళ్యాణ్ సినిమా 'సర్దార్ గబ్బర్‌సింగ్' అభిమానుల్ని చాలా గట్టిగానే ఇబ్బందిపెట్టిందనడం నిస్సంందేహమే. 'శౌర్యం', 'లచ్చిందేవికి లక్కుంది', 'గరం', 'తుంటరి' ఇలా చాలా సినిమాలు ఈ ఏడాది సగటు తెలుగు సినీ ప్రేక్షకుడ్ని నిరాశపరిచిన సినిమాల లిస్ట్‌లో చేరిపోయాయి.
ALSO SEE : Qlik Here For Laxmi Raai Hot Gallery