Bimbisara: తెలుగు సూప‌ర్ మ్యాన్‌... బింబిసార‌!

మరిన్ని వార్తలు

హాలీవుడ్ లో సూప‌ర్ హీరో సినిమాల‌కు కొద‌వ ఉండ‌దు. సూప‌ర్‌మేన్‌, స్పైడ‌ర్ మాన్‌, బ్యాట్ మెన్‌... వీళ్లంతా సూప‌ర్ హీరోలే. అయితే మ‌న‌కూ అలాంటి హీరోలు తయార‌వుతున్నారు. `బాహుబ‌లి` ఓ సూప‌ర్ హీరో. ఇప్పుడు `బింబిసార‌`ని కూడా అలానే మారుద్దామ‌నుకుంటున్నాడు క‌ల్యాణ్ రామ్. ఆయ‌న హీరోగా న‌టిస్తూ, నిర్మించిన చిత్రం... బింబిసార‌. ఆగ‌స్టు 5న విడుద‌ల అవుతోంది. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంద‌ని ముందు నుంచీ చెబుతున్నారు. సో.. సినిమా ఫ‌లితం ఎలాగున్నా, పార్ట్ 2 ఉంటుంది. హిట్ట‌యితే మాత్రం దీన్నో సూప‌ర్ మెన్ సిరీస్‌గా మార్చి, క‌నీసం రెండేళ్ల‌కు ఓ సినిమా విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు వశిష్ట్ చెప్పారు.

 

``సూప‌ర్ మాన్ సిరీస్‌లో ఉండే స్ట‌ఫ్‌.. బింబిసార‌లో ఉంది. ఆపాత్ర‌ని ఎన్ని సీజ‌న్‌లైనా చేయొచ్చు. పార్ట్ 2 కాదు.. పార్ట్ 10 వ‌ర‌కూ చేసుకుంటూ వెళ్లొచ్చు. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ మ‌రో కొత్త హీరోని క‌థ‌లోకి తీసుకురావొచ్చు. ఆ అవ‌కాశం.. బింబిసార క‌థ‌కి ఉంది.చూద్దాం.. ఈ సినిమా ఎన్ని పార్టులుగా వ‌స్తుందో`` అని చెప్పుకొచ్చారు వ‌శిష్ట‌. ఆయ‌న‌కు ఇదే తొలి సినిమా. అయితే ఈ ద‌ర్శ‌కుడు కూడా ఒక‌ప్పుడు హీరోనే. `ప్రేమ‌లేఖ రాశా` అనే సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టించారు. గీత ర‌చ‌యిత కుల‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. అయితే.. ఈ సినిమా విడుద‌ల కాలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS