కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రం 'బింబిసార'. ఇదో సోషియో ఫాంటసీ కథ. దీనిపై కల్యాణ్ రామ్ భారీగా ఖర్చు పెట్టారు. సినిమా హిట్టయితే... పార్ట్ 2, 3, 4 లు కూడా తీస్తానని ప్రకటించారు. మొన్నటి వరకూ 'బింబిసార' చాలా సైలెంట్ గా ఉండిపోయింది. ట్రైలర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమాకి రూ14 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. కల్యాణ్ రామ్ సినిమాకి రూ.14 కోట్ల బిజినెస్ ఎక్కువే. కాకపోతే... బింబిసార బడ్జెట్ వేరు. కనీసం ఈ సినిమాపై కల్యాణ్ రామ్ ఇప్పటి వరకూ రూ.25 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. అంటే మరో రూ.11 కోట్లు శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచి రావాలి. సినిమా విడుదలకు ముందే... శాటిలైట్, డిజిలట్ రైట్స్ అమ్ముడుపోతే బాగుంటుందని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడు. అయితే కల్యాణ్ రామ్ పెద్ద హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. అందుకే డిజిటల్ మార్కెట్ కాస్త సైలెంట్ గా ఉంది. ఆగస్టు 5 న ఈ సినిమా విడుదల కానుంది. అంటే ఇంకా దాదాపుగా నెల రోజుల సమయం ఉంది. ఈలోగా ప్రమోషన్లు జోరుగా చేసి, ఈ సినిమాకి క్రేజ్ తీసుకురావాలన్నది కల్యాణ్ రామ్ ఆలోచన. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా సరే, పార్ట్ 2 తీసేయాలని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడట.