Tamannaah: త‌మ‌న్నా సీన్లు లేపేస్తున్నారా?

మరిన్ని వార్తలు

త‌మ‌న్నాకి ఓ సాలీడ్ హిట్ ప‌డి చాలా కాల‌మైంది. ఎఫ్ 3 హిట్టే అయినా.. త‌మ‌న్నాకి గుర్తుండిపోయే సినిమా కాదు. అందులో మ‌గ‌రాయుడిగా క‌నిపించిన విధానం హాస్యాస్ప‌దంగా మారింది. అస‌లు ఆ గెట‌ప్ లో అస్సలు సూట్ అవ్వ‌లేదు. పైగా ఆ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు త‌మ‌న్నా డుమ్మా కొట్టింది. త‌మ‌న్నా నుంచి వ‌స్తున్న సినిమాల్లో `గుర్తుందా శీతాకాలం` ఒక‌టి. అస‌లు ఈ సినిమాపై ఎలాంటి బ‌జ్ లేదు. ఇక త‌న ఆశ‌ల‌న్నీ భోళా శంక‌ర్‌పైనే.

 

చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ఇందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ప్ప‌.. త‌మ‌న్నా చేతిలో మ‌రో బిగ్ ప్రాజెక్ట్ లేదు. అయితే... ఈ సినిమాలో త‌మ‌న్నా క్యారెక్ట‌ర్ కి అంత ప్రాధాన్యం లేద‌ని తెలుస్తోంది. అన్నా - చెల్లెళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. చిరు చెల్లాయిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. చిరు - కీర్తీల‌కే స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌. స్క్రిప్టు లో త‌మ‌న్నా పాత్ర‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు త‌మ‌న్నా సీన్లు మెల్ల‌మెల్ల‌గా లేపేస్తున్నార‌ని తెలుస్తోంది.

 

త‌మ‌న్నా పాత్ర‌కు క‌త్తెర్లు ప‌డుతున్నాయ‌ని, హీరోయిన్ కాస్త మెల్ల మెల్ల‌గా అతిథి పాత్ర‌గా మారిపోయింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. అంటే.. ఈ సినిమాపై కూడా త‌మ‌న్నా ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందే అన్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS