స్వీయ నిర్బంధంలో టాలీవుడ్ హీరోయిన్‌!

By iQlikMovies - June 02, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

క‌రోనా మ‌రింత విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎక్క‌డ చూసినా క‌రోనా క‌ష్టాలే. సెల‌బ్రెటీలూ అందుకు అతీతులు కారు. క‌రోనా కాటు వాళ్ల‌పైనా బ‌లంగా ప‌డుతోంది. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్‌.. స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. త‌నే.. బిందు మాధ‌వి. ఆవ‌కాయ్ బిర్యానీ, పిల్ల‌జ‌మిందార్ లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది బిందు. అయితే ఆ త‌ర‌వాత ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఇప్పుడు త‌ను చెన్నైలో ఉంటోంది.

 

బిందు మాధ‌వి నివాసం ఉంటుంద‌న్న‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్య‌క్తికి కరోనా వైర‌స్ రావ‌డంతో మున్సిపల్ సిబ్బంది ఆ అపార్ట్మెంట్ ని సీజ్ చేశారు. ఆ అపార్ట్‌మెంట్ లో నివ‌సిశిస్తున్న వాళ్లంతా 14 రోజులు స్వీయ నిర్బంధం పాటించాల్సిందేన‌ని, ఎవ‌రూ ఇల్లు వ‌దిలి బ‌య‌ట‌కు రాకూడాద‌ని మున్సిప‌ల్ సిబ్బంది ఉత్త‌ర్వులు జారీ చేసింది. దాంతో బిందు మాధ‌వి మ‌రో 14 రోజులు పాటు ఆ అపార్ట్‌మెంట్‌కే అంకితం కానుంది. ఈ విష‌యాన్ని బిందు మాధ‌వినే స్వ‌యంగా తెలిపింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS