బిపాషా పెంచేస్తోంది నిషా

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ బిపాషా బసు అంటేనే హాట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటిది ఈ హాట్‌ భామ అంతకన్నా హాట్‌గా తన భర్తతో కలిసి కండోమ్‌ యాడ్‌లో నటించింది. ఈ యాడ్‌ పలు వివాదాలకు కేంద్ర బిందువైంది కూడా. అంత విచ్చల విడి శృంగారంతో వాణజ్య ప్రకటన చేస్తారా? అంటూ వివాదాలు తలెత్తాయి. అయితే అందుకు ఈ ముద్దుగుమ్మ చాలా హాట్‌గానే స్పందించింది. అందులో తప్పేముంది.. దాని ద్వారా ఓ మెసేజ్‌నే పాస్‌ చేస్తున్నాను నేను అని చాలా లైట్‌గా చెప్పేసింది. అదీ బిపాషా అంటే. తెలుగులో అప్పుడెప్పుడో 'టక్కరి దొంగ' సినిమాలో నటించింది. మహేష్‌బాబుతో జోడీ కట్టింది ఆ సినిమాలో ఈ బ్యూటీ. తాజాగా గోవా బీచ్‌లో తన భర్తతో ఇలా ఎంజాయ్‌ చేస్తోంది. స్విమ్‌ చేస్తూ ప్రేమ లోతుల్ని చూస్తున్నానంటోంది. ప్రేమ లోతులు సరే కానీ అమ్మడి అందాల్లోని లోతులు ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసేలా ఉంది ఈ పిక్‌. బిపాషా సో హాట్‌ గురూ! అనుకోకుండా ఉండలేకపోతున్నారు ఈ పోజు చూసి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS