అల్లరోడే కానీ, నిఖార్సయినోడు.!

By iQlikMovies - June 30, 2018 - 12:26 PM IST

మరిన్ని వార్తలు

బర్త్‌డే బోయ్‌ అల్లరి నరేష్‌ తొలి సినిమా టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తనయుడు. వాస్తవానికి దర్శకత్వం వైపు కానీ, నిర్మాణ రంగం వైపు కానీ వెళతాడనుకున్నారు. అనుకోకుండా హీరో అయ్యాడు. తొలి సినిమాతోనే మెప్పించాడు. నటనలో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనిపించాడు. ఇక అంతే వెనక్కి తిరగి చూడలేదు. వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కామెడీతో పాటు, 'గమ్యం', తదితర సినిమాలతో తనలోని విలక్షణ నటున్ని పరిచయం చేశాడు. అల్లరి నరేష్‌ సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ సినిమా అనే స్టేజ్‌కొచ్చాడు. కానీ ఈ మధ్య అల్లరోడికి ఏం చేసినా ఫలించడం లేదు. కామెడీ బోర్‌ కొట్టేసింది. ఎంత ట్రై చేసినా సక్సెస్‌ దరి చేరడం లేదు. దాంతో కొంచెం గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ మధ్యనే మళ్లీ బిజీ అవుతున్నాడు. తాజాగా 'సిల్లీ ఫెలోస్‌', చిత్రంలో నటిస్తున్నాడు అల్లరి నరేష్‌. ఈ సినిమాలో మరో కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కామెడీ చిత్రమే అయినా కానీ, ఈ చిత్రంలో విభిన్నమైన థ్రిల్‌ ఇస్తానంటున్నాడు నరేష్‌. మరోవైపు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలోనూ అల్లరి నరేష్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చూడాలి మరి అల్లరోడికి ఈ ఏడాదైనా మంచి సక్సెస్‌ వచ్చి ఇదివరకటి గుర్తింపు మళ్లీ తెచ్చుకోవాలని ఆశిస్తూ, బర్త్‌డే బోయ్‌కి హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దామా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS