అదుగో' గ్లామర్‌ అంటే ఆమెదే.!

By iQlikMovies - June 30, 2018 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

చూశారుగా ఈ పిక్‌. షార్ట్‌ జీన్స్‌, మోడ్రన్‌ టాప్‌లో వయ్యారంగా కెమెరాకి పోజిచ్చిన ఈ భామ ఎవరో తెలుసా? తెలీదులెండి. ఇంకా పరిచయం కాలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ గ్లామర్‌ పాప. పేరు నభా నటేష్‌. విలక్షణ దర్శకుడు రవిబాబు తెరకెక్కిస్తున్న 'అదుగో' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతేకాదండోయ్‌ ఇంకా పరిచయం కాకుండానే ఈ బ్యూటీ రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న 'నన్ను దోచుకుందువటే' సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌. సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతలోనూ అనుభవం ఉందీ పాపకి. సో వెండితెరపై అందాల ఆరబోతకు ఆ అనుభవం చాలదా ఏంటి చెప్పండి.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS