బిగ్ బాస్ 4 హడావుడి మొదలైపోనుంది. బిగ్ బాస్ తొలి మూడు సీజన్లూ తెలుగులో సూపర్ హిట్ కావడంతో నాలుగో సీజన్‌పై అందరి దృష్టీ పడింది. లాక్ డౌన్ నుంచి షూటింగులకు మినహాయింపులు ఇవ్వడంతో - బిగ్ బాస్ కి తెర తీసినట్టైంది. బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎలాంటి అడ్డంకీ లేదిప్పుడు. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం కూడా సెలబ్రెటీల ఎంపికలో తలమునకలైపోయింది. ఈసారి సెలబ్రెటీల హవా మరింత ఎక్కువ కనిపించబోతోందని టాక్.
తరుణ్, రాశీ, రాకేష్ మాస్టర్, ఉదయ భాను లాంటి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బిత్తిరి సత్తి పేరు కూడా చేరింది. బుల్లి తెర వీక్షకులకు బిత్తిరి సత్తిని కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లోనూ మెప్పించాడు. తుపాకీ రాముడుతో హీరోగా మారిపోయాడు. బిత్తిరి ఉంటే, ఈ షోలో మరింత ఫన్ వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందని సమాచారం. దాంతో బిత్తిరితో సంప్రదింపులు మొదలెట్టారని తెలుస్తోంది. బిత్తిరి గనుక ఎంట్రీ ఇస్తే..ఈ బిగ్ బాస్ లో బిగ్ ఫన్ ఉండడం ఖాయమే.