వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. నిత్యం ఎదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటుంది కంగనా . మొన్నటివరకు సినిమాలకి పరిమితం అయిన ఈ వివాదాలు ఇప్పుడు రాజీకీయాల్లో కూడా మొదలయ్యాయి. కంగనా బీజేపీ తరపున 'మండి' నియోజక వర్గం ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. అయితే తన నియోజక వర్గ ప్రజలు, తాము ఎన్నుకున్న నాయకురాల్ని కలవటానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు తీసుకుని రావాలని ఒక నియమం పెట్టింది కంగనా. పైగా దీనికి కారణం ఉందట.
కంగనా బాలీవుడ్ క్వీన్. బిగ్ సెలబ్రిటీ నియోజక వర్గం పేరు చెప్పి పలువురు ఆమెను కలవటానికి వచ్చే ఆవకాశముంటుంది అని , దానిని నిరోధించటానికి కేవలం తన నియోజక వర్గ ప్రజలు మాత్రమే తనని కలిసేలా ఈ ఆధార్ మెలిక పెట్టింది. అలా అయితే బయట వ్యక్తులు తనవరకు రాకుండా ఆపొచ్చని ఆమె వాదన. ఎంతైనా సినిమా తెలివితేటలు అనిపించుకుంది క్వీన్. కంగనా పోటీ చేసి గెల్చిన మండి నియోజకవర్గం ఒక పర్యాటక ప్రదేశం. టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. స్థానికులు కాకుండా మిగతావారు తన టైమ్ వేస్ట్ చేస్తున్నారని కంగనా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల సమస్యలు వినటానికి సమయం వెచ్చించలేకపోతున్న అని. ఆధార్ వలన స్థానికుల సమస్యలు, పనులపై వచ్చిన ప్రజలకి మాత్రమే తన సమయం వెచ్చించ వచ్చని ఆమె అభిప్రాయం. అంతే కాదు ఎందుకు కంగనని కలవటానికి వస్తున్నారో కూడా చెప్పాలని కండీషన్ పెట్టింది. కంగనా ఉదేశ్యం మంచిదే కానీ దీనిపై పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ఒక ఎంపీ ప్రజల్ని కలవటానికి ఆధార్ కార్డ్ అడగడం సబబు కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ కంగనా ఫాన్స్ మాత్రం త్వరిత గతిని సమస్యల పరిష్కారానికి ఇదే మంచి మార్గమని సమర్థిస్తున్నారు.