#NBK107: ద‌స‌రాకు వ‌స్తున్న జై బాల‌య్య‌

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. కానీ ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ తెలీలేదు. అన్న‌గారు, న‌ర‌సింహారెడ్డి, జై బాల‌య్య.... ఇలా చాలా పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఇప్పుడు అందుకు ముహూర్తం కుదిరింది. బాల‌య్య సినిమా టైటిల్ ని ఈ ద‌స‌రాకి రివీల్ చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. అంతేకాదు... ఓ చిన్న స‌ర్ప్రైజింగ్ టీజ‌ర్ కూడా వ‌ద‌లబోతున్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి జై బాల‌య్య అనే టైటిల్ దాదాపుగా ఖాయం అయిపోయిన‌ట్టే.

 

శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. సాయిమాధ‌వ్ బుర్రా... సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. త‌మన్ సంగీత ద‌ర్శకుడు. అక్టోబ‌రు నాటికి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ముందు అనుకొన్న ప్ర‌కార‌మైతే డిసెంబ‌రులో ఈ సినిమా విడుద‌ల కావాలి. అయితే సంక్రాంతికి రిలీజ్ చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS