నాగచైతన్య - విక్రమ్ ప్రభు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రం క్లాప్ కొట్టుకొంది. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా పాపులర్ స్టార్ అరవింద్ స్వామిని ఎంచుకొన్నట్టు సమాచారం. ధృవలో అరవింద్ స్వామి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది. స్టైలీష్‌విలన్ పాత్రలకు అరవింద్ బాగా సెట్టవుతాడన్న నమ్మకం కలిగింది. అయితే ఆ తరవాత అరవింద్ స్వామి దగ్గరకు ఎన్ని విలన్ పాత్రలు వెళ్లినా ఆయన ఒప్పుకోలేదు. ఎట్టకేలకు చైతూ సినిమాకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవల `ధ్యాంక్యూ`లో నటించాడు నాగచైతన్య. ఎన్నో అంచనాలు పెట్టుకొన్న ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఘోరంగా విఫలమైంది. అమీర్ ఖాన్ తో చేసిన `లాల్ సింగ్ చద్దా` కూడా ఫ్లాపయ్యింది. అందుకే విక్రమ్ ప్రభు సినిమాపై ఫోకస్ పెట్టాడు. పరశురామ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా, దాన్ని పక్కన పెట్టి - అర్జెంటుగా వెంకట్ ప్రభు సినిమాని పట్టాలెక్కించాడు. మరి ఈ సినిమా ఫలితం ఏమవుతుందో..?