ప్రియాంక చోప్రాకి నోటీసులు

By iQlikMovies - July 03, 2018 - 14:45 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకి BMC ఒక గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ విషయమై పెద్ద చర్చ నడుస్తున్నది.

ఇక వివరాల్లోకి వెళితే, ప్రియాంక చోప్రాకి ముంబైలోని అంధేరీ లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నది. అయితే ఆ కాంప్లెక్స్ కి వాస్తు దోషం అంటూ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు తీసుకోకుండా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం ఆ మార్పులే ఇప్పుడు అక్రమ కట్టడాలుగా కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. 

దీనితో ఇలా తమ అనుమతి లేకుండా నిర్మించన వాటికి సమాధానం ఇవ్వాలి అని అదే సమయంలో ఆ అక్రమ కట్టడాలని కూడా వీలైనంత త్వరగా తొలగించాలి అని ప్రియాంక చోప్రా ని ఉద్దేశ్యించి లీగల్ నోటిసులు పంపించడం జరిగింది. 

వీటికి సమాధానం ఇస్తూ ఆ అక్రమ కట్టడాలు తోలిగించకపోతే వెంటనే తామే వాటిని కూల్చివేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఈ లీగల్ నోటిసులకి ప్రియాంక ఇంకా స్పందించలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS