బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ టాస్క్ కలకలం

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ హౌస్ సీజన్ 2 రోజురోజుకి ఆసక్తికర మలుపులు తిరుగుతున్నది. నిన్నటిరోజున బిగ్ బాస్ తనీష్ & అమిత్ లకి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఆ టాస్క్ ఇంటి సభ్యులందరి మధ్యలో దూరం పెంచుతున్నది.

ఇప్పటికే ఇంటి సభ్యులైన సామ్రాట్-తేజస్వి మధ్య ఏదో జరుగుతుంది అన్న మాటలు మిగతా సభ్యుల మధ్య నడుస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు మొదలైన ఈ కొత్త టాస్క్ ఇంటిలోని వారి మధ్య దూరం మరింతగా పెంచుతున్నది.

ఇక టాస్క్ విషయానికి వస్తే, తనీష్ & అమిత్ లు వారికి ఇచ్చిన టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులందరినీ వారు చెప్పిన కట్టు కథని బాగా నమ్మించగలుగుతున్నారు. అయితే ఈ టాస్క్ లో గనుక అమిత్ & తనీష్ లు విజయం సాధిస్తే అప్పుడు ఇంటిలోని అందరికి ప్రత్యేక విందు ఉంటుంది అని బిగ్ బాస్ హామీ ఇవ్వడం కొసమెరుపు.

ఏదేమైనా... ఇటువంటి ఆసక్తి రేపే అంశాలతో బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులని మరింతగా ఆకర్షిస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS