బయోపిక్స్‌కే ఇప్పుడు బోలెడంత ఆదరణ దక్కుతోంది. అలాంటి బోల్డ్ బయోపిక్స్‌ని ఇంకెలాంటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాలా? అందుకే ఓ మోస్తరు డైరెక్టర్లు ఇప్పుడు బోల్డ్ బయోపిక్స్‌పై ఫోకస్ పెట్టారు. అయితే ఈ బోల్డ్ బయోపిక్స్‌కి వివాదాలు కూడా ఎక్కువే. అయినా కానీ, లెక్క చేయకుండా, వీటిపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు.
తాజాగా షకీలా బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షకీలా అంటే ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మలయాళంలో మోహన్‌లాల్, ముమ్ముట్టి వంటి పెద్ద స్టార్స్ సినిమాలతో షకీలా సినిమాలు పోటీ పడేవి అప్పట్లో అంటే, ఆమెకున్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు సినిమాల్లో కూడా షకీలా పాత్ర అంటే మేల్ ఆడియన్స్ ఎలా ఊగిపోయేవారో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం షకీలా హవా అంతగా కొనసాగడం లేదు. ఈ తరుణంలో ఆమె బయోపిక్ వస్తుందంటే అందరిలోనూ ఆశక్తి నెలకొంది. లంకేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
అయితే షకీలా బయోపిక్‌లో ఎలాంటి అంశాలు చూపించబోతున్నారు? అంటే, అన్ని రకాల అంశాలను టచ్ చేయనున్నారట. అందులో భాగంగానే బోల్డ్ కంటెన్ట్కీ ఎక్కువ స్కోప్ ఇవ్వనున్నారనీ తెలుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చడ్దా షకీలా పాత్రను పోషిస్తోంది. తన జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తున్నామంటూ చిత్ర యూనిట్ తనను సంప్రదించగా, షకీలా తన లైఫ్‌లో జరిగిన అన్ని విషయాలను ఓపెన్‌గా చెప్పేసిందట.
కొన్ని బయోపిక్స్‌లో రియాలిటీ ఉండట్లేదు. కానీ తన బయోపిక్‌లో మాత్రం ఖచ్చితంగా నిజాలనే చూపించాలని కోరిందట షకీలా.