దర్శక ధీరుడు రాజమౌళి ఒక మంచి పనికోసం తలపెట్టిన ఛాలెంజ్ ని స్వీకరించాడు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి, తెలంగాణలో ప్రస్తుతం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా దానికి ప్రచారం కల్పించే నిమ్మిత్తం ఎంపీ కల్వకుంట్ల కవిత నిన్నటి రోజున తన ట్విట్టర్ ద్వారా మొక్కలు నాటే ఛాలెంజ్ ని ప్రముఖులైన రాజమౌళి, సైనా నెహ్వాల్, ABN రాధాకృష్ణ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ లకి ఇవ్వడం జరిగింది.
ఈ తరుణంలో కవిత ఛాలెంజ్ ని స్వీకరించిన రాజమౌళి, తన ఫార్మ్ హౌస్ లో మూడు మొక్కలు నాటి ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఆయన ఈ ఛాలెంజ్ ని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, యువ దర్శకులు సందీప్ రెడ్డి వంగ & నాగ్ అశ్విన్ లతో పాటుగా కేటీఆర్ లకి ఇచ్చారు.
చూద్దాం.. ఈ హరితహారం ఛాలెంజ్ ఎంతవరకు ఈ కార్యక్రమానికి మేలు చేస్తుందో...