బాల్డ్ హెడ్‌తో పాపం ఓ మగాడు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ పాట్లే తన కథకు మూలంగా తీసుకుని, బాలీవుడ్‌లో ఇటీవల 'బాలా' అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. కాన్సెప్ట్‌ని ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్‌గా మలచడంతో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాఫీస్‌కి కాసుల పంట పండింది. పెళ్లి కాకుండానే పాపం నెత్తి మీద ఎకరాలన్నీ ఖాళీ అయిపోయిన ఆ హీరో అమ్మాయిల్ని పడేసే ప్రయత్నంలో పడ్డ పాట్లు సినిమాలో చాలా ఫన్నీగా చూపించారు. ట్రైలర్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలయ్యాక కూడా సంచలన విజయం అందుకుంది. బాలీవుడ్ నోళ్లలో బాగా నానింది.
యూనివర్సల్ కాన్సెప్ట్, అన్ని వర్గాల ఆడియన్స్‌కీ అర్ధమయ్యే స్టోరీ కావడంతో, తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాకి ఎట్రాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ యామీ గౌతమ్‌కి ఓ విచిత్రమైన అనుభవం ఏర్పడింది. రియల్ లైఫ్‌లో బాల్డ్ హెడ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అని కొందరు ఆమెని డైరెక్ట్‌గా క్వశ్చన్ చేశారు. సడెన్‌గా అలా అడిగేసరికి పాపం ఏం చేస్తుంది? ఎస్ అని సమాధానమిచ్చింది. అంతేకాదు, బాల్డ్ హెడ్ ఉన్నవాళ్లు చాలా కూల్ అండ్ కామ్.. అని బెస్ట్ కామెంట్ కూడా ఇచ్చేసింది. ఇంకేముంది.. 'బాలా' సినిమాలోని హీరోలా పెళ్లి కాకుండానే ఆ సమస్యను ఫేస్ చేస్తున్న బాల్డ్ హెడ్ బాబులు అమ్మడి సమాధానానికి తెగ మురిసిపోతున్నారు.