ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాని అంతమొందించేందుకు సూపర్ మ్యాన్‌లా మారిపోవాలనుంది.. అంటూ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. కరోనా పీడిత ప్రపంచంలో ప్రస్తుతం ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేను సూపర్ మ్యాన్‌గా మారిపోయి ఈ కరోనాని అంతమొందించేయాలనుంది.. అంటూ బిగ్‌బీ అమితాబ్ వ్యాఖ్యానించారు. ఇక కరోనాపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి బాలీవుడ్ స్టార్ సెబ్రిటీలు అలియాభట్, మాధురీ దీక్షిత్, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ఓ వీడియోని ప్రిపేర్ చేశారు.
కరోనాపై జాగ్రత్తల గురించి వివరిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ వీడియోని బిగ్‌బీ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగానే ఆయన పై విధంగా రెస్పాండ్ అయ్యారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనే సూపర్ నేచురల్ పవర్స్‌తో పలు సినిమాల్లో నటించాం. చూశాం. కానీ, అలాంటి సూపర్ నేచురల్ పవర్ ఇప్పుడు మన ప్రపంచానికి అవసరమైంది.. అనే నేపథ్యంలో ఆయన అలా రెస్పాండ్ అయ్యారనుకోవాలి. అంటే కరోనా ఇంపాక్ట్ ప్రపంచంపై ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి. ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా, వ్యక్తిగత పరిశుభ్రతను, సోషల్ బాధ్యతను తప్పక పాఠించాలి.
T 3476 - A fancy dress birthday party for Abhishek in his very early years .. dress theme 'SUPERMAN' ..
— Amitabh Bachchan (@SrBachchan) March 20, 2020
काश की वास्तव में हम superman बन कर इस सभयंकर महामारी Corona Virus को सदा के लिए नष्ट कर सकते !! pic.twitter.com/DvT90WYs6f