మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’పై బాలీవుడ్ హీరో ఒకరు స్పెషల్ పోకస్ పెట్టారట. సౌత్ సినిమాల్ని రీమేక్ చేయడంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే ఆ సీనియర్ హీరో, ‘ఆచార్య’ సినిమాని హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచనతో వున్నాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.
ఇప్పటికే ‘ఆచార్య’ టీమ్‌తో సదరు బాలీవుడ్ సీనియర్ హీరో సంప్రదింపులు కూడా జరిపాడట. పైగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఆ సీనియర్ హీరో అత్యంత సన్నిహితుడు కావడంతో, కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆచార్య’ బాలీవుడ్‌లోకి ఆ హీరో ద్వారా వెళ్ళే అవకాశాలు వున్నాయని అంటున్నారు. అయితే, ప్రస్తతం టాలీవుడ్‌లో చాలా పెద్ద సినిమాలు పాన్ ఇండియా.. అంటున్నాయి. దాంతో, ‘ఆచార్య’ కూడా ఆ పాన్ ఇండియా ఆలోచనలతోనే తెరకెక్కుతోందని భావించొచ్చు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెల్సిందే. కరోనా దెబ్బ కొట్టిందిగానీ, లేకపోతే ఈ సంక్రాంతికి ‘ఆచార్య’ సినిమాని థియేటర్లలో చూసేందుకు ఎదురుచూసేవాళ్లమే. భారీ బడ్జెట్‌తో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.