కన్నడ కస్తూరి రష్మిక మండన్న, తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. తక్కువ సినిమాలతో చాలా ఎక్కువ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ ఫిగర్ అయిపోయింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆమె మీద అభిమానం ప్రదర్శిస్తున్నారు. కత్రినా, దీపిక తదితర అందాల భామల్ని పక్కకు నెట్టి రష్మిక, యంగ్ ఆడియన్స్ మదిలో అత్యున్నత స్థానం దక్కించుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా.
ఇంత ఫాలోయింగ్ రష్మికకి ఎలా సొంతమైంది.? అని అంతా ఆశ్చర్యపోతున్న వేళ, బాలీవుడ్ యంగ్ హీరో ఒకరు రష్మికని బాలీవుడ్‌కి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఓ సౌత్ రీమేక్‌ని ఇప్పటికే ఖరారు చేసుకున్న ఆ యంగ్ హీరో, రష్మికతో సంప్రదింపుల ప్రక్రియ స్టార్ట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రాబోతోందట. అయితే, తెలుగులో రష్మిక చేయాల్సిన సినిమాలు చాలానే వున్నాయి. మరి, వాటిల్లో దేన్నయినా రష్మిక వదులుకునే ఛాన్స్ వుందా.? అన్న అనుమానాలూ విన్పిస్తున్నాయి.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రష్మిక ఓ సినిమా చేయాల్సి వున్న విషయం విదితమే. అదిప్పుడు రష్మిక చేజారిపోయినట్లేనని అంటున్నారు. బాలీవుడ్‌కి వెళితే రష్మికకి పేరు, డబ్బులొస్తాయేమోగానీ.. ఎక్కువ కాలం ఒకే సినిమా కోసం ఫిక్సయిపోవాల్సి వుంటుందక్కడ. సౌత్‌లో అలా కాదు.. ఎడా పెడా సినిమాలొస్తాయ్.. పేరు ప్రఖ్యాతులూ పెరుగుతాయ్.. సంపాదన సంగతి సరే సరి.