గ్లామ్‌షాట్‌: బికినీ పంజా విసిరిన 'ఆడపులి'

మరిన్ని వార్తలు

బ్యాక్‌ సైడ్‌ నుండి బికినీలో తన అందాల్ని దర్శనమిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.? త్వరలోనే తెలుస్తుంది. ఆల్రెడీ పరిచయం ఉన్నా, కానీ, అసలు సిసలు పరిచయానికి సిద్ధమవుతోందిప్పుడే. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రంలో ఈ ఆడపులి ఐటెం సాంగ్‌లో మెరవనుంది. పేరు ఈషా గుప్తా. బాలీవుడ్‌ ఐటెం బాంబ్‌. తెలుగులో తన వన్నె చిన్నెల్ని వయ్యారాల్ని ఒలకబోసేందుకు మెగా పవర్‌స్టార్‌ సరసన హాట్‌ అండ్‌ సెక్సీ స్టెప్పులేసేందుకు సిద్ధమైపోతోంది.

 

బోయపాటి సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది. మాంచి ఊపు, మాంచి మసాలా ఉండేలా ఐటెం సాంగ్స్‌ని కంపోజ్‌ చేయిస్తాడు బోయపాటి. అందులోనూ రామ్‌చరణ్‌లాంటి హీరోతో స్పెషల్‌ సాంగ్‌ అంటే 'జిగేల్‌మనిపోదు'. అందుకే బాలీవుడ్‌ నుండీ హాట్‌ ఐటెం బాంబ్‌ని దిగుమతి చేశారు. ఇక సాంగ్‌ ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలిసిపోనుంది. అందాకా ఆ సాంగ్‌లో చిందేసే హాట్‌ హాట్‌ అందాల ఆడపులి స్పైసీ గ్లామర్‌ని ఇదిగో ఇలా చూసి ఎంజాయ్‌ చేసేయ్యండి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS