గ్లామ్‌షాట్‌: రెడ్‌ హాట్‌ కైరా అద్వానీ.!

By iQlikMovies - December 17, 2018 - 10:42 AM IST

మరిన్ని వార్తలు

'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి, తన క్యూట్‌ అందంతో కుర్రకారును కిర్రెక్కించింది. అందంతో పాటు, హాట్‌ గ్లామర్‌, అంతకుమించి పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. వస్తూ వస్తూనే స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సత్తా చాటింది. తొలి సినిమాకే బ్లాక్‌ బాస్టర్‌ అందుకోవడంతో రెండో సినిమాలోనూ కైరా పర్‌ఫామెన్స్‌పై అంచనాలున్నాయి. ఈ సంక్రాంతికి కైరా నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

సూపర్‌స్టార్‌తో చిందేసిన ఈ భామ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌తో మాస్‌ స్టెప్పులు కలపనుంది. ఈ సినిమా నుండి లేటెస్టుగా విడుదలైన స్టిల్‌లో కైరా అద్వానీ ఈజ్‌, గ్లామర్‌ వంపులు అప్పుడే కుర్రకారును మత్తెక్కించేస్తున్నాయి. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విజయంపై భారీ అంచనాలున్నాయి.

 

ఇకపోతే సోషల్‌ మీడియాలో అమ్మడికి ఉన్న క్రేజ్‌ కూడా చెప్పుకోదగ్గదే. అందుకే హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కి మరింత ఊపు తెస్తుంటుందీ భామ. తాజా పిక్‌ విషయానికి వస్తే, రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో ఎప్పటిలాగే క్యూట్‌ లుక్స్‌తో సరికొత్తగా ఎట్రాక్ట్‌ చేస్తోంది కైరా అద్వానీ. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS