గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజంట్ గేమ్ చేంజెర్ రిలీజ్ తో జనవరిలో సందడి చేయనున్నాడు. నెక్స్ట్ బుచ్చిబాబు కాంబోలో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్ షూట్ మొదలైంది. మైసూర్‌లో తొలి షెడ్యూల్ ప్రారంభమై, 15 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. చెర్రీ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మెగా ఫాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్లు సమాచారం.
ఆ స్టార్ హీరో మరెవరో కాదు సల్మాన్ ఖాన్ అని టాక్. మెగా ఫ్యామిలీతో సల్మాన్ కి మంచి అనుబంధం ఉంది. చెర్రీ కెరియర్ లో మొదట్లో బాలీవుడ్ లో 'జంజీర్' మూవీ చేసినప్పుడు, సల్మాన్ భాయ్ ఫుల్ సపోర్ట్ చేసాడు. అంతే కాదు చరణ్ కి సల్మాన్ ఇంటి నుంచి రోజు క్యారేజ్ కూడా వచ్చేదట. చిరు, చరణ్ లతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సల్మాన్ 'గాడ్‌ఫాదర్' లో గెస్ట్ రోల్ చేసాడు. అది కూడా ఫ్రీగా. నయా పైసా తీసుకోకుండా. అందుకే RC16కి సల్మాన్ నో చెప్పడని యూనిట్ నమ్మకంగా ఉంది. ఆ పాత్రకి సల్మాన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నాడట.
బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెనలో విజయసేతుపతి పాత్రకి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు కూడా సల్మాన్ పాత్రకి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అని తెలుస్తోంది. RC16 పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పుడు చెర్రీ, సల్మాన్ కాంబో బాలీవుడ్ లో కూడా కిక్ ఇస్తుంది అని మేకర్స్ అంచనా వేస్తున్నారు. RC16 కి 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.