స్వాతంత్ర్య సమరయోధులు అయిన నేతాజీ సుబాష్ చంద్ర బోస్ మరణంపై ఇప్పటికి అనుమానులు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆయన పై ఎన్నో చిత్రాలు వచ్చినా, ఆయన మరణం పై ఏ చిత్రం ఇంతవరకు రాలేదు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడైన పుల్కిత్.. నేతాజీ మరణంపై ఒక వెబ్ సిరీస్ రూపొందించాడు. ఇందులో ప్రముఖ కథానాయకుడు రాజ్ కుమార్ రావు టైటిల్ పాత్ర పోషించగా, ఆరోజుల్లో అసలు ఏమి జరిగింది? నిజంగా బోసు మరణించాడా లేదా అనే అంశం పైనే ఈ వెబ్ సిరీస్ కొనసాగనుంది.
ఇప్పటికే ఈ ట్రైలర్ విడుదల అయి అందులో ముఖ్య పాత్ర పోషించిన రాజ్ కుమార్ రావు అభినయం అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఇక వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలయిన నేపధ్యంలో ఇటువంటి అంశం పై వెబ్ సిరీస్ రూపొందడం నిజంగా గొప్ప విషయం.