బాల‌య్య‌కు షాక్ ఇచ్చిన నిర్మాత‌.

మరిన్ని వార్తలు

ఇటీవ‌ల విడుద‌లైన బాల‌కృష్ణ సినిమా రూల‌ర్ డిజాస్ట‌ర్ వైపుగా ప‌రుగులు పెడుతోంది. 2019లో బాల‌య్య‌కు వ‌రుస‌గా ఇది మూడో ఫ్లాప్‌. 40 కోట్ల‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి థియేట‌రిక‌ల్ నుంచి 10 కోట్లు కూడా రాలేదు. ఈ ఎఫెక్ట్ బాల‌య్య త‌దుప‌రి సినిమాపై ప‌డింది. త్వ‌ర‌లో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం లో చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌. ఈ సినిమా ఇప్పుడు డైలామాలో ప‌డింద‌ట‌. ఈ సినిమాకి 70 కోట్ల బ‌డ్జెట్ లెక్క తేలింది.

 

రూల‌ర్ రిజ‌ల్ట్ రాక ముందు ఈ బ‌డ్జెట్ పెట్ట‌డానికి నిర్మాత రెడీగానే ఉన్నా, ఇప్పుడు వెన‌క‌డుగు వేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇంత బ‌డ్జెట్ అంటే నావల్ల కాద‌ని చేతులెత్తేశాడ‌ట‌. అంతేకాదు. బాల‌య్య‌, బోయ‌పాటి పారితోషికాలు తీసుకోకుండా, లాభాల్లో వాటా తీసుకుంటే.. ఈ ప్రాజెక్టు చేస్తాన‌ని చెబుతున్నాడ‌ట నిర్మాత‌. ఆయ‌న మాట‌కు బాల‌య్య‌, బోయ‌పాటి ఓకే అంటారా? లేదంటే మ‌రో నిర్మాత‌కు ఈ ప్రాజెక్టు అప్ప‌గిస్తారా అనేది తేలాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS