చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌కి సినిమాలపై ఉన్న ఆసక్తితో వెండితెరపై హీరోగా మెరిసిపోవాలనుకున్నాడు. 'విజేత' సినిమాతో ఆ ముచ్చట తీర్చేసింది మెగా ఫ్యామిలీ. చిరంజీవి చిన్నల్లుడు అనే ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమా మామగారి సినిమా టైటిల్‌నే తన సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని క్యాజువల్ స్టోరీతో హీరోగా ఓకే అనిపించుకున్నాడు. అయితే, ముచ్చట మాత్రం తీర్చుకున్నాడు కానీ, ఆ తర్వాత సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో 'సూపర్ మచ్చి' సినిమా ఎప్పుడో అనౌన్స్ అయ్యింది. అయితే, ఏమంత ఫాస్ట్‌గా ఆ సినిమా పనులు జరుగుతున్నట్లు కనిపించడం లేదు. అసలీ సినిమాలో హీరోయినే కన్‌ఫామ్ కావడం లేదు.
మొదటిగా 'తూనీగ' పాప రియా చక్రవర్తిని అధికారికంగా ప్రకటించారు. ఏమైందో ఏమో కానీ, ఆమెను కట్ చేసి, ఆ ప్లేస్‌లోకి కన్నడ బ్యూటీ రుచితా రామ్‌ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె పేరు కూడా డౌటే అంటున్నారు. ఈ ఇద్దరినీ అధికారికంగానే చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, అనధికారికంగా తొలిగించే ప్రయత్నాలు చేస్తోంది. రుచితాకీ, కళ్యాణ్ దేవ్‌కీ మధ్య ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సరిగ్గా వర్కవుట్ కావడం లేదట. అందుకని ఈమెని కూడా హోల్డ్‌లోనే ఉంచారట. సో మళ్లీ దేవ్ కోసం హీరోయిన్ వేట కొనసాగిస్తున్నారట. ఇదేం చోద్యం చిరంజీవి అల్లుడికి హీరోయిన్ కష్టాలా.? అని ఆశ్చర్యపోతున్నారు ఈ ముచ్చట తెలిసిన ప్రేక్షకులు. అసలింతకీ ఈ ముచ్చటలో సత్యమెంత.? నిజంగానే ఈ సినిమాకి హీరోయిన్ కష్టాలా.? ఏమో ఏంటో.!