బోయపాటి శ్రీను డైరెక్షన్ అనగానే ఆ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అయి ఉండాలి. టైటిల్ దగ్గర్నుంచే ఈ మాస్ అప్పీల్ కన్పిస్తుంటుంది. కానీ బోయపాటి రూట్ మార్చాడు. టైటిల్‌ని కూల్‌గా ప్రెజెంట్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా కోసం బోయపాటి వెరైటీ టైటిల్‌ని డిసైడ్ చేశాడు. అదేంటో తెలుసా? 'జయ జానకీ నాయక'. ఈ మధ్యన ఈ తరహా టైటిల్స్ ట్రెండీగా మారాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి కూల్ టైటిల్స్‌కి ఎట్రాక్ట్ అవుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అందుకే ఇప్పుడు ఇది ట్రెండింగ్ అయిపోయింది. జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ బోయపాటి డిఫరెంట్‌గా ఈ టైటిల్ పెట్టాడనుకోవాలి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, 'స్పీడున్నోడు'తో కాస్త వేగం తగ్గించాల్సి వచ్చింది. మళ్ళీ బోయపాటి కాంబినేషన్‌లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేలా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఫైట్స్, డాన్సుల్లో బెల్లంకొండ ఇప్పటికే తన సత్తా చూపించాడు. ఈ సారి చేయబోయే సినిమాలో ఇంకా బోలెడన్ని ప్రత్యేకతలు దాగున్నాయట. అవేంటో ఒక్కొక్కటిగా రివీల్ చేయనుందట చిత్ర యూనిట్.