చిరు కోసం బోయపాటి ‘మెగా’ కథ!

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తరువాత ఆయనతో చిత్రాలు చేయడానికి అగ్ర దర్శకులందరూ ఆసక్తి చూపుతున్నారు.

అందులో బోయపాటి శ్రీను పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక ఈ వారంలో బోయపాటి శ్రీను ఒక కథతో చిరుని కలవబోతున్నట్టు సమాచారం, చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గటుగా రూపొందించిన ఈ కథని ఎలాగైనా చిరుతో ఒకే చేయించాలి అన్న పట్టుదలతో బోయపాటి ఉన్నాడట.

ఇక ఉయ్యాలవాడ చిత్రం ఆగష్టు నెలలో ప్రారంభం అవనుండగా, ఈ చిత్రం కూడా ఒకే అయితే ఈ సంవత్సరంలోనే దీనికి ముహూర్తం పడనున్నట్టు సమాచారం.

అన్ని అనుకున్నట్టు జరిగితే, బోయపాటి-చిరు కలయికలో ఒక మంచి కమర్షియల్ సినిమా రాబోతున్నదనమాట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS