ప్రముఖ హీరో రవితేజ ఆయనతమ్ముడు భరత్ మరణించిన వారం తరువాత ఆ విషయం పై స్పందించాడు.
ఒక ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తమ్ముడి మరణాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎలా వక్రీకరించాయో అన్న దాని పైన ఆయన తన మనసులోని భాదని పంచుకున్నాడు.
అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలు మీకోసం-
- తమ కుటుంబం నుండి భరత్ విడిపోయాడు అన్నది చాలా పెద్ద అబద్దం. చనిపోయే కొన్ని రోజుల ముందే భరత్ పుట్టినరోజుని తామందరు కలిసి చేసుకున్నట్టు తెలిపాడు.
- ఇక భరత్ దహన సంస్కారాలకి రాలేకపోవడానికి కారణం కేవలం తనని అలా చూడలేకనే అని చెప్పుకొచ్చాడు. అంతేతప్ప వేరే కారణాలు ఏమి లేవు అని చెప్పాడు.
- పైగా దహన సంస్కారాలు కూడా ఎవరో తెలియనవాళ్ళ తో చేయించాము అని కూడా ప్రచారం చేశారు కొంతమంది. అందులో ఏమాత్రం నిజం లేదు, ఆ కార్యక్రామాలు నిర్వహించింది మా పిన్ని (అమ్మ చెల్లెలి) గారి భర్త.
- చనిపోయిన విషయం తెలిసిన వెంటనే- మా నాన్న, అమ్మ ఇద్దరు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇద్దరినీ మామూలు స్థితికి తీసుకొచ్చే పనిలో ఉన్నాను.
- తమ్ముడు చనిపోయిన తెల్లవారే షూటింగ్ కి వెళ్ళిపోయాడు అంటూ నాకు నా తమ్ముడి పైన ప్రేమ లేదు అనే ప్రచారం చేశారు. కాకపోతే నేను అలాంటి వాటికి స్పందించను, షూటింగ్ అనేది కొన్ని కోట్ల వ్యాపారం తో కూడుకున్న అంశం, నా ఒక్కడి కారణంగా నిర్మాతకి, తోటి ఆర్టిస్టులకి ఇబ్బంది కలగడం ఇష్టం లేకనే షూటింగ్ కి వెళ్ళాను.
- తమ్ముడిని కడసారైన చూడలేదు రవితేజ అంటూ కొందరు రాశారు. అయితే మీరు గమనిస్తే నేను ఏనాడు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చనిపోతే నేను వాళ్ళని చూడడానికి వెళ్ళలేదు. నాకు అంత ధైర్యం సరిపోదు, మనతో అంత సన్నిహితంగా మెలిగిన వారి మరణం నన్ను చాల బాధ పెడుతుంది. అందుకే నేను నా తమ్ముడిని ఆ పరిస్థితుల్లో చూడడానికి రాలేదు అని చెప్పాడు.