బోయపాటి శ్రీను సినిమా అంటే యాక్షన్‌కి పెద్ద పీట వేయాల్సిందే. హీరో బలంగా కాలు కింద ఆనిస్తే చాలు.. భూకంపం వచ్చిన ఎఫెక్టులు వస్తాయి. విలన్ ని నేలమీద.. కొడితే.. బంతిలా ఎగిరిపడుతుంటాడు. ఇవన్నీ సైన్స్ సూత్రాలకు అందని మ్యాజిక్కులే. కానీ తెరపై చూస్తే బాగుంటుంది. బోయపాటి సినిమాలకు ఫైటింగులు ఎక్కువగా కంపోజ్ చేసేది రామ్ లక్ష్మణ్ మాస్టర్లే. బోయపాటి స్టైల్ ఏమిటో వాళ్లకేతెలుసు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకీ వాళ్లే ఫైట్స్ చేస్తున్నారు.
కాకపోతే... ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ తో బోయపాటికి సమస్యలు వచ్చాయట. వాళ్లతో బోయపాటి `ఫైటింగ్`కి దిగాడని, అందుకే ఈ సినిమా నుంచి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు అర్థంతరంగా వెళ్లిపోయారని టాక్. ఈ సినిమాలో అన్ని ఫైట్లనీ రామ్ లక్ష్మణ్ మాస్టర్లే కంపోజ్ చేయాలి.
అయితే రెండు ఫైట్లు తీశాక.. వాళ్లు ఈ ప్రాజెక్టు నుంచి బయటకువెళ్లిపోయారు. వాళ్ల స్థానంలో స్టంట్ శివ వచ్చాడట. ఇదంతా బోయపాటికీ - రామ్ లక్ష్మణ్ మాస్టర్లకు వచ్చిన క్రియేటీవ్ డిఫరెన్సెస్ వల్లే అని తేలింది. సినిమాల్లో ఇది సహజమే. క్రియేటీవ్ స్పేస్ లేకపోతే... ఇలాంటి సర్దుబాట్లు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే.. ఫైట్ మాస్టర్లతో ఫైటింగ్ ది దిగడం.. కాస్త కొత్త. అంతే.