నాని - సుధీర్ బాబు చేసిన మల్టీస్టారర్ `వి`. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ (అమేజాన్) లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. నాని క్రేజ్, ఇమేజ్‌కి ఏమాత్రం సరితూగని సినిమా అని.... విమర్శకులు తేల్చేశారు. నానికి ఈమధ్య కాలంలో ఇలాంటి ఫ్లాప్ రాలేదు. ఇప్పుడు... ఈ సినిమాపై ముంబై సిటీ కోర్టు అక్షింతలు వేసింది. వెంటనే ఈ సినిమాని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి తొలగించాలని ఆదేశించింది.
దానికి కారణం.. ఓ చిన్న ఫొటో. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ముంబై మోడల్ 'సాక్షి మాలిక్' ఫొటోని వాడారు. ఆమెను సెక్స్ వర్కర్‌గా చూపించారు. ఆ సీన్..పై సాక్షి ముంబై హై కోర్టులో పిటీషన్ వేసింది. తన అనుమతి లేకుండా.. ఆ ఫొటో ఎందుకు వాడతారు? అని ప్రశ్నించింది. దాంతో హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సదరు సన్నివేశాన్ని చిత్రం నుంచి తొలగించేంత వరకూ ఆ సినిమాని అమేజాన్ నుంచి తీసేయాలని కోర్టు ఆదేశించింది.