నవ్వుల బ్రహ్మ బ్రహ్మానందం ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మన బ్రహ్మీ ఇప్పుడు తాతయ్యగా ప్రమోషన్ పొందారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్.. నాన్నయ్యారు. గౌతమ్ - జోత్స్య దంపతులకు మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డ జన్మించాడు. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరో అయ్యాడు గౌతమ్. ఇటీవల బసంతి లో మెరిశాడు. ఇప్పుడు మను అనే ఓ చిత్రంలో నటిస్తున్నాడు.