పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` ఇటీవలే విడుదలై, తొలి మూడు రోజులూ బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకుంది. నాలుగో రోజు మహా శివరాత్రి వల్ల.... వసూళ్లు పెద్దగా డ్రాప్ అవ్వలేదు. కానీ ఆ తరవాత... అనూహ్యంగా కలక్షన్లలో మార్పు కనిపించింది. చాలా చోట్ల... థియేటర్లు ఖాళీగా కనిపించాయి. తొలి వారంలో దాదాపుగా రూ.88 కోట్ల షేర్ సాధించింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.
నైజాంలో ఈ సినిమాని రూ.30 కోట్లకు కొన్నారు. ఇప్పటి వరకూ రూ.29 కోట్లు వచ్చాయి. మరో కోటి రూపాయలు రాబట్టడం అంత కష్టమేం కాదు. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ చాలా స్వల్ప మార్జిన్లు ఉన్నాయి. ఈ శని, ఆది వారాలు భీమ్లాకి చాలా కీలకం. శుక్రవారం `ఆడవాళ్లూ మీకు జోహార్లు` సినిమా వచ్చింది. ఈ సినిమాకి డివైడ్ టాక్ నడుస్తోంది. కాబట్టి.. బాక్సాఫీసు దగ్గర మరో సినిమా ఏం లేదు. సో.. భీమ్లా ఈ వీకెండ్ కూడా ఎన్నో కొన్ని వసూళ్లు అందుకోవచ్చు. వచ్చేవారం.. `రాధేశ్యామ్` వస్తోంది కాబట్టి, అప్పటికి భీమ్లా సైడ్ అయిపోవాలి. ఈలోగా బ్రేక్ ఈవెన్ దాటుకుని వెళ్లాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రూ.10 కోట్లు సంపాదిస్తే.. భీమ్లా బ్రేక్ ఈవెన్ అయిపోవొచ్చు.