‘సెబాస్టియ‌న్ ’ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, తదితరులు
దర్శకత్వం : బాలాజీ సయ్యపురెడ్డి
నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు
సంగీత దర్శకుడు: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి
ఎడిటర్ : విప్లవ్‌ న్యసదాం


రేటింగ్ : 2/5


వరుసగా రెండు విజయాలు అందుకున్నాడు కిర‌ణ్ అబ్బవ‌రం. ‘రాజావారు రాణీగారు’, ‘ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ మండ‌పం’ సినిమాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడాయ‌న నుంచి వ‌చ్చిన మూడో చిత్రం ‘సెబాస్టియ‌న్ ’. ఇందులో కిర‌ణ్ రేచీక‌టి స‌మ‌స్య ఉన్న కానిస్టేబుల్‌గా నటించ‌డం.. ఆసక్తి పెంచింది. ఈ సినిమాతో కిరణ్ ఖచ్చితంగా హ్యాట్రిక్ కోడతాడడా ? అనే చర్చ జరిగింది. మరి ఆ హ్యాట్రిక్ విజయం కిరణ్ కి దక్కిందా? రేచీకటి వున్న కానిస్టేబుల్ తన విధులు ఎలా నిర్వర్తించాడు ? ఒక్కసారి సెబాస్టియ‌న్ కథలోకి వెళితే.. 


కథ :


సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) ఓ రేచీక‌టి కానిస్టేబుల్. త‌న‌కు రేచీక‌టి ఉంద‌న్న నిజాన్ని దాచి పెట్టి ఉద్యోగం సంపాదిస్తాడు సెబా. ఏదోలా ఉద్యోగాన్ని మేనేజ్‌ చేస్తూ వస్తాడు. కొన్ని రోజులు బాగానే సాగిపోతుంది. ఓరోజు సెబాకి నైట్ డ్యూటీ చేయాల్సివ‌స్తుంది. ఆ రోజే ఓ హ‌త్య జ‌రుగుతుంది. క్రైమ్‌సీన్‌లో ఆధారాలు మిస్ అవ్వకుండా… కాప‌లా కాయాల్సిన బాధ్యత సెబాస్టియ‌న్‌పై ప‌డుతుంది. స‌రిగ్గా అప్పుడే క్రైమ్ సీన్లోకి ముగ్గురు వ్యక్తులు .. ఒక‌రి త‌ర‌వాత మ‌రొక‌రు వ‌చ్చి సాక్ష్యాధారాల్ని చెరిపేసే ప్రయ‌త్నం చేస్తారు. నైట్ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సెబాస్టియ‌న్ స‌స్పెండ్ అవుతాడు. మ‌రోవైపు స‌రైన సాక్ష్యాలు లేని కార‌ణంగా ఆ హ‌త్యకేసుని న్యాయ‌స్థానం కొట్టేస్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? హ‌త్య కేసుని ఛేదించే క్రమంలో సెబాకి ఎదురైన స‌వాళ్లేంటి? ను హ‌త్య చేసిందెవ‌రు? అన్నది తెరపై చూడాలి. 


విశ్లేషణ :


'లోపం' కూడా మంచి కధా వస్తువు. హీరో పాత్రకు ఓ లోపం వుండి ఆ లోపం చుట్టూ కథని నడపం ఇది వరకూ చాలా సినిమాల్లో చూశాం. కుంటి, గుడ్డి, మూగ .. ఇలా కొన్ని పాత్రలు హీరోలుగా మెప్పించాయి.సెబాస్టియ‌న్ కూడా అదే లైను. 
రేచీక‌టి స‌మ‌స్య ఉన్న ఓ కానిస్టేబుల్‌.. త‌న‌కున్న లోపం ఓ మ‌హిళ‌ను కాపాడ‌లేక‌పోవ‌డం.. ఈ క్రమంలో జ‌రిగిన‌ మ‌రో పొర‌పాటు వ‌ల్ల ఆ హ‌త్య కేసుకు సంబంధించిన ఆధారాలు చెరిగిపోవ‌డం.. ఇలా లైన్‌గా చూస్తున్నప్పుడు ఓ ఆస‌క్తిక‌ర క్రైమ్ థ్రిల్లరే అనిపిస్తుంది. అయితే దాన్ని మలిచిన విధానం మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు.


సినిమాని ప్రారంభించిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. రేచీక‌టి లోపం వ‌ల్ల సెబాస్టియ‌న్ నైట్ డ్యూటీలో ప‌డే ఇబ్బందులు వరకూ ఓకే .. కానీ అసలు కథ మొదలైనాక స‌హ‌నానికి ప‌రీక్షలా ఉంటుంది. క‌థ‌నం.. పూర్తిగా గాడి త‌ప్పుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు విచారణ ఆయువు పట్టు. విచారణ, పరిశోధన ఎంత పట్టుగా సాగితే ప్రేక్షకుడు అంత థ్రిల్ ఫీలౌతాడు. కానీ ఇందులో థ్రిల్ వుండదు. కండ్ హాఫ్ లో ఎక్కడ వేసిన గొంగ‌ళి అక్కడే అన్నట్టు స‌న్నివేశాలు అలా సాగుతూ సాగుతూ ఉంటాయి. పైగా రోహిణి ఆత్మ రూపంలో మాటి మాటికీ వ‌చ్చి కొడుక్కి హిత‌బోధ చేయ‌డం విసుగు తెప్పిస్తుంది. ఈ సినిమాకి రోహిణీ ట్రాక్ మైనస్. ఈ జోనర్ 'ఆత్మ' లాంటి ట్రాక్ అస్సల్ నప్పలేదు. కొన్ని సన్నివేశాలు లాజిక్ కి దూరంగా వుంటాయి. కొన్ని కంటిన్యుటీలు పోయినట్లు కూడా స్పష్టంగా అర్ధమౌతుంటుంది. కొన్ని సన్నివేశాలు లింకులు కూడా కుదరలేదు. పైగా హంతకులు ఎవరనేది ముందే హింట్ ఇచ్చి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ముందే నీరుగార్చేశారు. 


నటీనటులు:


రేచీక‌టి లోపంతో ఇబ్బందిప‌డే కానిస్టేబుల్‌గా కిరణ్ న‌ట‌న సూపర్ అని చెప్పలేం కానీ ఓకే. కిరణ్ బలం వినోదం. సెబాస్టియన్ కథలోనే వినోదం లేదు. దీంతో కిరణ్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎస్సైగా చేసిన శ్రీకాంత్ అయ్యంగార్‌ కి మంచి మార్కులు పడాతాయి.హీరోయిన్లు పాత్రలు తేలిపోయాయి. మిగతా నటులు పరిధి మేర చేశారు. 


టెక్నికల్ గా :

జిబ్రాన్ మంచి మ్యూజిక్ చేశాడు. నేపధ్య సంగీతం, పాట‌లు బావున్నాయి. కెమరా పనితనం ఓకే. నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. కొత్త పాయింట్ అందుకున్నాడు దర్శకుడు. అయితే దాన్ని వెండితెరపైకి మలచిన విధానం మాత్రం ఆకట్టుకోదు. 


ప్లస్ పాయింట్స్


కిరణ్ అబ్బవరం 
మంచి పాయింట్ 
నేపధ్య సంగీతం 


మైనస్ పాయింట్స్ 


బలహీనమైన కధనం 
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : సెబ్బాస్ అనలేం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS