'రాక్ష‌స రాజు'కి బ‌డ్జెట్ స‌మ‌స్య‌లా..?!

మరిన్ని వార్తలు

రానా - తేజ కాంబోలో 'రాక్ష‌స‌రాజు' అనే సినిమా ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. ఈ సినిమాకి కొన్ని బ‌డ్జెట్ సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. పేప‌ర్ పై ఈ సినిమా బ‌డ్జెట్ రూ.50 కోట్ల‌కు పైనే తేలింది. మేకింగ్ ప్రోసెస్ లో అది ఇంకాస్త పెర‌గొచ్చు. 'నేనే రాజు నేనే మంత్రి' త‌ర‌వాత తేజ‌కు హిట్ లేదు. ఆయ‌న గ‌త చిత్రం `అహింస‌` డిజాస్ట‌ర్ లిస్టులో చేరిపోయింది. ఈ ద‌శ‌లో తేజ సినిమాపై రూ.50 కోట్లు పెట్ట‌డం రిస్కే. మ‌రోవైపు ఓటీటీ, శాటిలైట్ మార్కెట్లు పూర్తిగా డ‌ల్ నోట్ లో సాగుతున్నాయి.


ఇలాంటి ద‌శ‌లో.. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా, లేదా?  అనే విష‌యంపై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఒక‌వేళ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సివ‌స్తే, క‌చ్చితంగా బ‌డ్జెట్ లో కొత‌లు త‌ప్ప‌వు. తేజ మాత్రం ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా తీస్తేనే స‌రైన అవుట్ పుట్ వ‌స్తుంద‌ని భావిస్తున్నాడు. ఆయ‌న ఎక్క‌డా త‌గ్గే ర‌కం కాదు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ముందుకు వెళ్తుందా, లేదా?  అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. వచ్చే  నెల‌లో ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈలోగా బ‌డ్జెట్ పై ఓ నిర్ణ‌యానికి రావాల్సివుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS