ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బయటకు వచ్చేసిన తేజ.. ఇప్పుడు మరోషాక్ ఇచ్చాడు. తన చేతిలో ఉన్న వెంకటేష్ సినిమానీ వదిలేసుకున్నాడని టాలీవుడ్ టాక్. `నేనే రాజు నేనే మంత్రి` తరవాత వెంకటేష్ పిలిచి మరీ తేజకు అవకాశం ఇచ్చాడు. ఓ పక్క ఎన్టీఆర్ సినిమా పనులు చూసుకుంటూనే వెంకీ సినిమా కూడా మొదలెట్టేశాడు.
ఆమధ్య రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది కూడా. అయితే ఈ సినిమా నుంచి కూడా తేజ తప్పుకున్నాడట. కథ విషయంలో కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయని, మరీ ముఖ్యంగా సెకండాఫ్ ఎంతకీ తెగడం లేదని, అందుకే ఈ ప్రాజెక్టు చేయలేనని తేజ చెబుతున్నాడట.
అలా.. ఒకేసారి... రెండు పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నాడు తేజ. నిజంగా ఇండ్రస్ట్రీకి ఇది షాకింగ్ విషయమే.