కరోనా నేపథ్యంలో సినిమాల బిజినెస్ ఎలా జరుగుతుంది.? అన్న ఆందోళన సర్వత్రా నెలకొన్నమాట వాస్తవం. అసలు సినిమాలు సినిమా హాళ్లలో విడుదలయ్యేదెప్పుడో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో నటీనటులు రెమ్యునరేషన్లు తగ్గించుకోవడంతోపాటుగా, సినిమా నిర్మాణ వ్యయం కూడా తగ్గిపోవడం ఖాయమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
అయితే, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘పుష్ప’ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని అంటోందట. సినిమా కాన్సెప్ట్ పట్ల చాలా ‘క్లియర్’గా వున్న సుకుమార్, అల్లు అర్జున్‌తోపాటు చిత్ర నిర్మాతలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని పూర్తి క్వాలిటీతో, ముందు అనుకున్న బడ్జెట్‌తోనే తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది. గతంలో అనుకున్నట్లే కేరళలోనే సినిమా షుటింగ్ జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సన్నివేశాల చిత్రీకరణ కోసం విదేశాలకూ వెళ్ళే అవకాశం వుందట.
‘పుష్ప’ అల్లు అర్జున్ కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్ ఫిలిం కాబోతోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మైండ్ బ్లాంక్ అయ్యేలా చూపించిన అల్లు అర్జున్, ఈసారి పాన్ ఇండియా సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమా విషయంలో అల్లు అర్జున్ మరింత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడనేది నిస్సందేహం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.