సుకుమార్ సినిమాలో బన్నీ పక్కా రాయసీమ కుర్రోడిలా కనిపించనున్నాడు. రాయసీమ కుర్రోడంటే, ముఖ్యంగా సీమ యాసపై పట్టుండాలి. ఆ యాసను పర్ఫెక్ట్గా దించేందుకు ఓ స్పెషల్ ట్రైనర్‌ని నియమించాడట డైరెక్టర్ సుకుమార్. ఆ ట్రెయినర్ సమక్షంలో బన్నీ రాయసీమ యాస నేర్చుకోనున్నాడట. చిత్తూరు బ్యాక్ డ్రాప్లో సాగే స్మగ్లింగ్ నేపథ్యమున్న సినిమా ఇది. సో చిత్తూరు కుర్రోడిలా బన్నీ తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకోవల్సి ఉంది. ఇటీవల ‘అల..’ సినిమాలో బంటు అనే బస్తీ మిడిల్ క్లాస్ కుర్రోడిలా కనిపించిన బన్నీ, ఇప్పుడు సుకుమార్ కోసం అసలు సిసలు చిత్తూరు కుర్రోడిలా మేకోవర్ కానున్నాడన్న మాట.
ఇదిలా ఉంటే, గతంలో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమా కోసం పక్కా గోదారి జిల్లా కుర్రోడిలా తన యాస, భాష, నడకా, నడతా మార్చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాగే బన్నీ కూడా పక్కా సీమ కుర్రోడి అవతారమెత్తనున్నాడన్న మాట. అంతేకాదు, ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ, ఎక్కువ భాగం ఫారెస్ట్‌లోనే చిత్రీకరించనున్నారట. కేరళ లొకేషన్స్‌లో ఆల్రెడీ బన్నీ లేకుండానే కొన్ని సీన్లు చిత్రీకరించిన సుకుమార్. ఇక ప్రస్తుతం బన్నీపై సాగే సీన్స్ కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.