యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం 'బుర్రకథ'. డబుల్ బ్రెయిన్‌తో, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని వచ్చాడు. కానీ, ఎంత చేసినా, ఆదిని ఈ సారి కూడా ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇదే రోజు సమంత నటించిన 'ఓ బేబీ' రిలీజ్ కావడంతో అది ఆదికి పెద్ద మైనస్ అయ్యింది. 'బేబీ' బజ్ ఆ రేంజ్‌లో ఉన్నప్పటికీ, ఆది కాన్ఫిడెంట్‌గా రిస్క్ చేయడం బాగానే ఉంది కానీ, బేబీని కొట్టేలా ప్రమోషన్స్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు.
ఒకవేళ ఆది ప్రమోషన్స్‌పై ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టి ఉండుంటే, ఓపెనింగ్స్‌కి ఎంతో కొంత లాభపడేవాడని ఆయన ఫ్యాన్స్ కొందరు అభిప్రాయ పడుతున్నారు. 'లవ్‌లీ', 'ప్రేమ కావాలి' తదితర చిత్రాలు ఆది కెరీర్‌లో ఫర్వాలేదనిపించాయి. ఒకవేళ రన్నింగ్‌లో 'బుర్రకథ' కూడా ఆ ప్లేస్‌కి రీచ్ అవుతుందేమో చూడాలి మరి. ప్రముఖ రచయితగా పేరున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.
మిస్తీ చక్రవర్తి, నైరాషా హీరోయిన్లుగా నటించారు. కామెడీ పరంగా ఈ సినిమాని చూసిన వాళ్లు కొంతమంది సేటిస్‌ఫైగానే ఫీలవుతున్నారు. కానీ, హిట్ అనిపించుకోవాలంటే, ఇది సరిపోదుగా. బాక్సాఫీస్‌కీ ఈ రెస్పాన్స్ సరిపోదు. ఏమో, ఈ రోజు, రేపు వీకెండ్ కావడంతో ఆది ఏమైనా పుంజుకుంటాడేమో, తన రెండు బుర్రలకు పదును పెట్టి, ఇంకాస్త ప్రమోషన్ గట్టిగా కొట్టి, కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నం చేస్తాడేమో చూడాలిక.