జోరు ఆపని బన్నీ బుట్టబొమ్మ

By Inkmantra - July 05, 2020 - 11:07 AM IST

మరిన్ని వార్తలు

ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజైన అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా సూపర్ హిట్లు అయ్యాయి. నిజానికి సినిమా విజయంలో థమన్ స్వరపరిచిన పాటలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికీ ఆ పాటలు భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దుమ్ము దులుపుతున్నాయి.

 

తాజాగా బుట్టబొమ్మ పాట 250 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి 25 న ఈ పాట వీడియోను యూట్యూబ్ లో విడుదల చేయగా నాలుగు నెలల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ పాటకు లైక్స్ సంఖ్య కూడా తక్కువేమీ లేదు. లైక్స్ రెండు మిలియన్లకు చేరువలో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన సంగీత ప్రియులను అలరించడంతోనే ఈ పాటకు ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ పాడారు. జాని మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట జోరు చూస్తుంటే ఈ వ్యూస్, లైక్స్ సంఖ్య ఇప్పట్లో ఆగేలా లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS