కరోనా ఎఫెక్ట్‌: కేన్స్‌ చిత్రోత్సవం బంద్‌.!

మరిన్ని వార్తలు

ఫ్రాన్స్‌లో ధూమ్‌ ధామ్‌గా జరగాల్సిన కేన్స్‌ చిత్రోత్సవం కరోనా కారణంగా రద్దయ్యింది. లేకుంటే, ఈ పాటికి మన ముద్దుగుమ్ములు కేన్స్‌ చిత్రోత్సవానికి సంబంధించి ర్యాంప్‌పై అందాల ఆరబోతతో విందు చేసేసేశారు. నేను గొప్ప అంటే, నేను గొప్ప అంటూ తమ కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ బుర్రకు పదును పెట్టి, చేతి నిండా పని పెట్టి ఫుల్‌ బిజీగా ఉండేవారు. కానీ, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ఇంపాక్ట్‌ ఫ్రాన్స్‌లోనూ ఎక్కువగా ఉండడంతో, ఈ ఏడాది ఈ ఉత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు కేన్స్‌ నిర్వాహకులు తెలిపారు.

 

మొదట్లో ఈ ఉత్సవాన్ని మే 12 నుండి 23 వ తేదీ వరకూ నిర్వహించాలని భావించారట. అయితే, ప్రపంచ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తమ నిర్ణయంలో వెనక్కి తగ్గారట. జూన్‌, జూలైల్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, ఇప్పట్లో కరోనా దారికొచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేన్స్‌ చిత్రోత్సవం ఈ ఏడాది సందిగ్ధంలో పడినట్లే. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ గేమ్స్‌ చాలా వరకూ వాయిదాలు పడ్డాయి. అసలు జరుగుతాయో లేదో అనే డైలమా ఆవహించింది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున ప్రపంచ నలుమూలల నుండీ సినీ తారలు హాజరయ్యే కేన్స్‌ చిత్రోత్సవాన్ని ఈ ఏడాదికి నిలిపివేయడమే సబబు అని నిర్వాహక వర్గాలు భావిస్తున్నాయట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS