బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కి కరోనా పోజిటివ్ అని తేలడం, ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. విదేశాల నుండి కరోనాని మోసుకొచ్చిన ఈ పాటగత్తె, ప్రపంచంలోని సిట్యువేషన్‌ని గాలికొదిలేసి, మూర్ఖత్వంతో వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశాన్ని గడగడలాడిస్తోంది. ఈమె అటెండ్ అయిన పార్టీ ఆషా మాషీ పార్టీ కాదు, ఉన్నతాధికారులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ. దాంతో ఈ వైరస్ ఇప్పుడు పార్లమెంట్‌నీ తాకేసింది. దీనికి హాజరైన వారిలో ఎంతమంది పోజిటివ్ అని తేలుతారో తెలీదు. కానీ, ఇప్పటికే ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని తేలింది. పార్టీ అనంతరం సదరు ఎమ్యెల్యేలు రాష్ట్రపతితోనూ భేటీ అయ్యారట. ఇప్పుడు రాష్ట్రపతికి కూడా కరోనా టెస్టులు జరుగుతున్నాయి. అలా ఈ సింగర్ చేసిన మూర్ఖపు పనికి దేశ ప్రధమ పౌరుడే దడ దడలాడాల్సి వచ్చింది.
సరే, కనికా సంగతి ఇలా ఉంటే, మన హీరోయిన్ల పరిస్థితి ఏంటీ? షూటింగ్స్ నిమిత్తం చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే విదేశీ పర్యటనలు సాగించి వచ్చారు. అయితే, మనవాళ్లు సోషల్ రెస్పాన్సిబులిటీతో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారనుకోండి. అయినా కానీ, టాలీవుడ్‌లో ఇప్పుడీ కొత్త టెన్షన్‌కి తెర లేచింది.