ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు అయిన కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
అందుతున్న సమాచారం ప్రకారం, ఆరోగ్యం బాగోకపోవడంతో కెప్టెన్ విజయకాంత్ ని ఆయన కుటుంబసభ్యులు చెన్నైలోని పోరూర్ కి దగ్గరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉంటున్నారంటూ తమిళనాట ఈమధ్య వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ వార్త ఆయన అభిమానులని ఇంకా కలవరపాటుకి గురిచేస్తున్నది. అయితే ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందులు ఏమి లేవని ఆయన రేపు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఏదేమైనా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.