తమిళనాడులో టాలీవుడ్ హీరోస్‌ని పెద్దగా ఇష్టపడరు. అలాంటిది 'స్పైడర్' సినిమాతో మహేష్‌బాబుకు అక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ మురుగదాస్ కావడం. ఈ సినిమాలో విలన్ సూర్య కావడం ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఆ రకంగా మహేష్‌కి అక్కడ ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే మహేష్ తర్వాత ఆ ప్లేస్‌లో నిలిచింది మాత్రం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రమే అని చెప్పాలి. విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' చిత్రం కోలీవుడ్‌లో 5 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఫిగర్‌తో అక్కడ నాన్ బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టేశాడు మనోడు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గీత గోవిందం' సినిమా ఓపెనింగ్ డే నుండీ రికార్డులు కొల్లగొడుతోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది.
ఈ సినిమా తర్వాత పెద్ద సినిమా కానీ, చెప్పుకోదగ్గ చిన్న సినిమా కూడా లేకపోవడంతో 'గీత గోవిందం' కలెక్షన్స్ హోరుకు బ్రేకుల్లేకుండా పోయాయి. అంతకు ముందొచ్చిన 'గూఢచారి' తదితర సినిమాలకు పోజిటివ్ రికార్డలొచ్చినా, 'గీత గోవిందం' ఎంట్రీతో అవేమీ ఈ సినిమా ముందు నిలబడలేకపోయాయి. 'ఆర్‌ఎక్స్ 100' తర్వాత ఈ మధ్య విడుదలైన సినిమాల్లో 'గీత గోవిందం' టాప్ ప్లేస్‌లో నిలిచింది.
విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు.