సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ని కుదిపేస్తోంది. కొంతమంది సినీ ప్రముఖుల్ని ఇరుకున పడేసింది. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్‌లపై బిహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైంది. సుశాంత్ ఆత్మహత్మకు వీళ్లే కారణమంటూ సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది కోర్టులో పిటీషన్ వేశారు. కరణ్ జోహార్, సంజయ్‌లీలా భన్సాలీ, ఏక్తాకపూర్, సల్మాన్ ఖాన్‌తో పాటు మరో 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద పిటిషన్ దాఖలు చేశారు.
సుశాంత్‌ను ఇటీవల ఏడు పెద్ద సినిమాల నుంచి తొలగించారని, కొన్ని సినిమాల్ని విడుదల కానివ్వకుండా అడ్డుకున్నారని, అందువల్లే ఒత్తిడికి గురైసుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఐసీసీ సెక్షన్ 306, 504, 506ల ప్రకారం ఈ ఎనిమిదిమందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటీషన్ దారుడు కోర్టుని కోరారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.