బాల‌కృష్ణ షాకింగ్ నిర్ణ‌యం

మరిన్ని వార్తలు

క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. షూటింగులకు అనుమ‌తి ఇచ్చినా - ఏ హీరో ధైర్యం చేయ‌డం లేదు. అగ్ర క‌థానాయ‌కులైతే స‌సేమీరా అంటున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ సైతం షూటింగుల‌కు ఏమాత్రం తొంద‌ర ప‌డ‌డం లేదు. `ఇలాంటి ప‌రిస్థితుల‌లో షూటింగులు జ‌రుపుకోవ‌డం అవ‌స‌ర‌మా?` అంటూ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు బాల‌కృష్ణ‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న షూటింగులంటే విముఖ‌త చూపిస్తున్న‌ట్టు టాక్‌.

 

బాల‌కృష్ణ - బోయ‌పాటి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల బాల‌య్య పుట్టిన రోజున ఓ టీజ‌ర్ కూడా వ‌దిలారు. లాక్ డౌన్ నుంచి మిన‌హాయింపులు వ‌చ్చాక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ రీ స్టార్ట్ చేయాల‌ని బోయ‌పాటి భావించాడు. కానీ బాల‌య్య ఇప్పుడు ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టాక్. 2021 జ‌న‌వ‌రి వ‌ర‌కూ ఈ సినిమా షూటింగ్ మొద‌లు పెట్టొద్ద‌ని బోయ‌పాటికి చెప్పాశాడ‌ట‌. ఒక‌వేళ షూటింగు మొద‌లెట్టినా తాను సెట్‌కి రాన‌ని బాల‌య్య అంటున్నాడ‌ట‌. బాల‌య్య లేకుండా షూటింగులు ఏం మొద‌లెడ‌తారు?  అందుకే బోయ‌పాటి కూడా 2020 త‌ర‌వాతే... ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు టాక్‌. ఇలాగైతే.. బాల‌య్య సినిమా 2021 చివ‌ర్లోగానీ రాన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS